హనుమకొండ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు..!!
కాకతీయ, హనుమకొండ : హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 2023లో జరిగిన హత్య కేసులో నిందితుడు పాలత్య రమేష్‌కు జీవిత ఖైదు శిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ, అడిషనల్ డిస్ట్రిక్ & సెషన్స్ జడ్జి బి. అపర్ణా దేవి శుక్రవారం తీర్పు ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ప్రాంతానికి చెందిన రమేష్, మృతుడు యంజాల శివతో స్నేహితులుగా ఉండేవాడు. ఇద్దరూ కూలి పనులు, చిల్లర దొంగతనాలు చేసి వచ్చిన డబ్బు పంచుకునేవారు. తరచూ గొడవలు జరిగే పరిస్థితిలో, 2023 సెప్టెంబర్...