ఉప రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన రాధాకృష్ణన్ కు శుభాకాంక్షలు: బీజేపీ మండల కార్యదర్శి తుమ్మల శ్రీనివాస్
కాకతీయ, బయ్యారం: భారతదేశ ఉపరాష్ట్రపతిగా ఎన్నికై శుక్రవారం ప్రమాణస్వీకారం చేసిన సిపి.రాధాకృష్ణన్ కు బీజేపీ పార్టీ బయ్యారం మండల కార్యదర్శి తుమ్మల శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలియజేశారు. సిపి రాధాకృష్ణన్ 1957 లో తమిళనాడులో జన్మించారు.16 ఏళ్ల వయసు నుంచే ఆర్ఎస్ఎస్, జన్ సంగ్లె సంఘాలలో పని చేస్తు 1998-99 సంవత్సరంలో కోయంబత్తూరు నుంచి బిజెపి పార్టీ తరఫున ఎంపీగా గెలుపొందారు. 2004లో,2014,2019లో ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.2004-07 వరకు తమిళనాడు బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు.2023లో జార్ఖండ్ గవర్నర్ గా ఎంపికయ్యారు. 2024...