ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్యాగుల పంపిణీ..!!
కాకతీయ, కరీంనగర్ బ్యూరో: కొత్త పల్లి మండలం ఎలగందల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు దాత సహకారంతో బ్యాగులను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అందుతున్న సౌకర్యాలను, సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో రాణించి సొంత కాళ్లపై నిలబడాలని సూచించారు. పదిమందికి సాయం చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఎలాంటి సహకారమైనా అందిస్తామని, పట్టుదలతో చదువుకుని మంచి ఫలితాలు...