గార్ల, డోర్నకల్ మండలాలలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆకస్మిక తనిఖీలు..!!

కాకతీయ, మహబూబాబాద్: గార్ల,డోర్నకల్ మండలాలలో యూరియా పంపిణీ ప్రక్రియ, కేజీబివి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లను, కేజిబివి పాఠశాలలో జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ ఆకస్మికంగా శుక్రవారం తనిఖీ లు నిర్వహించారు. జిల్లాలో కొనసాగుతున్న యూరియా పంపిణీ సరఫరా కార్యక్రమాన్ని ప్రతి ఒక్క అధికారి అంకితభావంతో పనిచేస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్రణాళిక ప్రకారం యూరియా సరఫరా చేస్తూ వచ్చే యూరియా కు సంబంధించి ముందస్తు సమాచారం ఇస్తూ, పూర్తిస్థాయిలో జిల్లా యంత్రాంగం నిమగ్నమై ఉన్నారని, అన్నారు....