లంబాడీలపై అసత్య ప్రచారం సరికాదు..!!

కాకతీయ, గీసుగొండ: లంబాడీలు గిరిజనులు కాదని వారిని గిరిజన జాబితా నుంచి తొలగించాలని చేస్తున్న అసత్య ప్రచారం సరికాదని బంజారా నాయకులు మండిపడ్డారు. మండలంలోని కొమ్మాల శ్రీలక్ష్మి నరసింహ స్వామి మినీ ఫంక్షన్ హల్‌లో శుక్రవారం రేవంత్ క్రియేటివ్ కాన్సెప్ట్స్ ఆధ్వర్యంలో బానోత్ రాఘవేంద్ర అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. బానోత్ రాఘవేంద్ర మాట్లాడుతూ బంజారా లంబాడిలు సింధు నాగరికత కాలం నుండే దేశ మూల నివాసులని, స్వాతంత్ర్యం రాకముందే గిరిజనులుగా గుర్తింపు పొందామని తెలిపారు. 1871లో బ్రిటిష్ పాలకులు బంజారాలను క్రిమినల్...