క్వారీల్లో బాంబ్ బ్లాస్టింగ్‌పై రైతుల ఆందోళన..!!

కాక‌తీయ‌, పెద్ద‌ప‌ల్లి: పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రామ పరిసరాల్లో క్వారీల్లో జరుగుతున్న బాంబ్ బ్లాస్టింగ్‌పై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి రాస్తారోకోకు దిగారు. ఈ సంద‌ర్బంగా రైతులు మాట్ల‌డుతూ.. క్వారీల్లో నిరంతరంగా జరుగుతున్న పేలుళ్ల కారణంగా భూమి కంపిస్తున్నట్లు అనిపిస్తోందని, పంటలు తీవ్ర నష్టానికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూకంపాల్లా దద్దరిల్లుతున్న శబ్దాలు, గాలిలో వ్యాపిస్తున్న దుమ్ము వల్ల పంటలు ఎండిపోతున్నాయ‌ని అవేద‌న వ్య‌క్తం చేశారు. రోజూ బాంబులు పేలుతూనే ఉన్నాయ‌ని, పొలాల్లో...