రైతుకు సరిపడ యూరియా అందించాలి: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

కాకతీయ, రాయపర్తి: పంటల అదునుకు యూరియా అందక నెల రోజుల నుండి తిండి తిప్పలు మాని యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తూ బేజారవుతున్నారని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. యూరియా అందించాలని మండల కేంద్రంలోని వరంగల్- ఖమ్మం జాతీయ రహదారి(563)పై శుక్రవారం రైతు సంఘాలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. మండలంలోని 40 గ్రామాల నుండి వేల సంఖ్యలో రైతులు హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నాకు మద్దతు తెలిపి రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని...