కుంభమేళా స్థాయిలో గోదావరి పుష్కరాలు..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో : గోదావరి పుష్కరాలను దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా, దక్షిణ భారత కుంభమేళా స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2027 జూలై 23 నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి...