పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

కాకతీయ, నర్సంపేట: యూరియా అందక పంట నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు 50వేల నష్టపరిహారాన్ని చెల్లించాలని ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే పెద్ది డిమాండ్ చేశారు. శుక్రవారం ఖానాపురం మండలంలోని మంగళవారిపేట ,గొల్లగూడెంతండా గ్రామాలలో యూరియా దొరకక నష్టపోయిన పంటలను నర్సంపేట పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా పంపిణీలో జాప్యం చేస్తున్న ఖానాపురం మండల వ్యవసాయ అధికారినీ తక్షణమే సస్పెండ్ చేయాలని, యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్న వ్యవసాయ అధికారుల పైన కలెక్టర్ చర్యలు తీసుకోవాలని అన్నారు. గొల్లగూడెం...