రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమే: జూపల్లి సంచలన వ్యాఖ్యలు

కాకతీయ, తెలంగాణ బ్యూరో: నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగిన ఇందిరమ్మ నమూనా గృహం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ తరపున మంత్రి పదవిలో ఉన్న జూపల్లి, వచ్చే ఎన్నికల్లో తన పార్టీ గెలుస్తుందో లేదో, తానే మళ్లీ గెలుస్తానో లేదో తెలియదంటూ హాట్ కామెంట్స్ చేశారు. జూపల్లి మాట్లాడుతూ .. నేను హామీలు ఇవ్వను. ఎందుకంటే వచ్చేసారి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు. నేను మళ్లీ గెలుస్తానో లేదో కూడా...