ఈనెల 14న ఎన్డీఏ, సిడిఎస్ పరీక్షలు..!!
కాకతీయ, హనుమకొండ : ఈ నెల 14వ తేదీన నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ), కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సిడిఎస్) పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి వై.వి. గణేష్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలో హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సిడిఎస్ పరీక్ష, వడ్డేపల్లిలోని ప్రభుత్వ పింగిలి మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్డీఏ పరీక్ష జరగనుంది. ఎన్డీఏ పరీక్ష సమయాలు.. ఉదయం 10:00 – మధ్యాహ్నం 12:30...