ఎంజీఎం ఆస్పత్రిలో మృత శిశువును వదిలి వెళ్ళిన తల్లిదండ్రులు..!!
కాకతీయ, వరంగల్ : ఎంజీఎం ఆసుపత్రిలో నెలలు నిండకుండా జన్మించిన మగ మృత శిశువును తల్లిదండ్రులు వదిలేసి వెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 8వ తేదీన తొర్రూరులోని ఓ ప్రసూతి ఆసుపత్రిలో 7 నెలల గర్భిణి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, శిశువుకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంలో అక్కడి వైద్యులు వరంగల్ సికేఏం కి తల్లిని, ఎంజీఎం ఆసుపత్రికి శిశువును రెఫర్ చేశారు. అదేరోజు కుటుంబ సభ్యులు శిశువును ఎంజీఎం ఆస్పత్రికి తీసుకురాగా పరీక్షించిన వైద్యులు శిశువు అప్పటికే మృతి...