నర్సింహులపేట మండల కేంద్రంలో హమాలీల నిరసన ..!!
కాకతీయ, నర్సింహులపేట: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేంద్రం వద్ద శుక్రవారం హమాలీలు నిరసన వ్యక్తం చేశారు. రైతులకు యూరియా సరఫరా చేస్తున్న క్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన సీఐ హమాలీల పట్ల దురుసుగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ యూరియా పంపిణీ కేంద్రానికి చేరుకొని నిరసన తెలిపిన హమాలీలను ఆప్యాయంగా పలకరించారు. అన్నం పెట్టే రైతన్నలకు మనమందరం కష్టకాలంలో తోడుగా ఉండాలని సూచించారు. అధికారులు ఎవరైనా అమర్యాదగా, దురుసుగా...