నకిలీ వైద్యులపై కఠిన చర్యలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో నకిలీ వైద్యులపై అధికారులు గట్టి నిఘా పెట్టి, చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TGMC) రిజిస్ట్రార్ డా. డి. లాలయ్య కుమార్ ఫిర్యాదు మేరకు ఇంతేజర్‌గంజ్, కాకతీయ యూనివర్సిటీ ఎక్స్ రోడ్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. ఎఫ్‌ఐఆర్ నంబర్లు 357/2025, 507/2025 కింద మామిడి ఈశ్వరయ్య, సి. హెచ్. వెంకట్ రెడ్డిలపై నకిలీ వైద్యం చేస్తున్నారని ఆరోపణలతో కేసులు నమోదు చేశారు. కాశిబుగ్గ, గోపాల్‌పూర్ ప్రాంతాల్లో వీరు ఎటువంటి వైద్య అర్హతలు లేకుండా...