తెలంగాణలోని ఈ జిల్లాలకు హై అలర్ట్.. నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల దాటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా శుక్రవారం, శనివారం రోజుల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని సూచించింది. శుక్రవారం నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, హైదరాబాద్,...