నకిలీ పురుగుమందులపై రైతుల రాస్తారోకో..!!

కాకతీయ, నల్లబెల్లి: నకిలీ పురుగుమందుల విక్రయంతో పంట నష్టపోయిన రైతు బాధపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నల్లబెల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. నందిగామ గ్రామానికి చెందిన రైతు ఇస్లావత్ రాజ్ కుమార్, తన మూడు ఎకరాల వరి పంటలో కలుపు నివారణ కోసం స్థానిక ఖాజా మైనుద్దీన్ ఫర్టిలైజర్ షాప్‌కు వెళ్లాడు. ఆయన కోరిన 'నామిని గోల్డ్' మందుకు బదులుగా, షాప్ యజమాని హైమద్ పాషా 'విన్ సూపర్' అనే మందును బలవంతంగా రూ. 1700కు అమ్మారు....