గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మహిళలకు ఉద్యోగావకాశాలు..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా లేదా బదిలీ వర్కర్లుగా పనిచేస్తున్న మహిళలకు సింగరేణి యాజమాన్యం ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ యంత్రాలపై ఆపరేటర్లుగా పని చేయడానికి ఎంపిక కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మైనింగ్ రంగంలో మహిళల సాధికారత, సమాన అవకాశాలు, మానవ వనరుల సమర్థ వినియోగంలో భాగంగా సీఎండీ ఎన్.బలరామ్ ఆలోచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శనివారం సింగరేణి యాజమాన్యం అన్ని గనులకు, డిపార్ట్మెంట్లకు సర్క్యులర్ విడుదల చేసింది. ఓపెన్ కాస్ట్ గనుల్లో...