మారుమూల తండా నుంచి మలేషియాకు..!!

కాకతీయ, వరంగల్ బ్యూరో: మారుమూల తండా నుంచి మలేషియాకు వెళ్తున్న గుగులోతు అశోక్ కుమార్ ను స్ఫూర్తిగా తీసుకోవాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి అజీజ్ ఖాన్ అన్నారు. శనివారం హనుమకొండ జేఎన్ఎస్ లో జిల్లా క్రీడా అధికారి గుగులోతు అశోక్ కుమార్ మలేషియాలో జరిగే అంతర్జాతీయ సెమినార్ కు వెళుతున్న సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అజీజ్ ఖాన్ హాజరై మాట్లాడారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మారుమూల తండ రతి రాం తండా...