ఇది ధైర్యవంతుల నేల.. మీ వెంటే నేను.. మణిపూర్ హింస బాధితులతో ప్రధాని మోదీ..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్‌లోని చురచంద్‌పూర్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మణిపూర్ స్ఫూర్తికి వందనం. మీ ప్రేమను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ రాష్ట్రం ఈశాన్యానికి ప్రకాశాన్ని జోడించే రత్నం అని అన్నారు. గతంలో హింస మణిపూర్‌ను కుదిపివేయడం బాధాకరమని, అయితే ఇప్పుడు ఆశ, విశ్వాసాల కొత్త ఉదయం ప్రారంభమవుతోందని తెలిపారు. కుకీలు, మెయిటీల మధ్య చర్చలు సాగుతున్నాయని, ప్రజలు శాంతి మార్గం వైపు అడుగులు వేస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. మణిపూర్ ప్రజలతో నేను...