స్కూల్ భవనంలో డ్రగ్స్ ముఠా పట్టివేత..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు జ్ఞానం పంచాల్సిన పాఠశాలలోనే మత్తు పదార్థాల తయారీ జరుగుతుందని ఎవరైనా ఊహించారా? కానీ బోయిన్‌పల్లిలోని మేధా స్కూల్ పై ఈగల్ టీమ్ నిర్వహించిన ఆపరేషన్‌లో నిజంగా సంచలన విషయాలు బయటపడ్డాయి. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు, స్కూల్ డైరెక్టర్ స్వయంగా విద్యాసంస్థను డ్రగ్స్ తయారీ కేంద్రంగా మార్చినట్లు తెలుస్తోంది. స్కూల్ ఆఫీస్ రూమ్‌తో పాటు మరో రెండు గదుల్లో మత్తు పదార్థాలను తయారు చేస్తూ పట్టుబడ్డాడు. పోలీసులు దాడి చేసి 7...