4 నెలలుగా జీతాలు లేక పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్య ..!!
కాకతీయ, సూర్యపేట: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. పంచాయతీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సోమిరెడ్డి అనే యువకుడు గత నాలుగు నెలలుగా జీతాలు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైలు కింద పడి జీవితాన్ని ముగించుకున్న సోమిరెడ్డి ఒక సూసైడ్ నోట్ రాశారు. అందులో, “నాకు ప్రతి నెల జీతం వచ్చుంటే ఇలాంటి పరిస్థితి రాదు. ఆర్థిక సమస్యల వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మీ అందరితో...