వాహన రీన్యువల్ నిబంధనల్లో కీలక మార్పులు: 20 ఏళ్ల వాహనాలకు భారీ ఫీజులు..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ (MoRTH) నోటిఫికేషన్ ప్రకారం, వాహనాల రిజిస్ట్రేషన్ రీన్యువల్ ఫీజులలో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా 20 సంవత్సరాలకుపైగా వయసు కలిగిన వాహనాలపై ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇప్పటివరకు లైట్ మోటార్ వాహనాల (LMV) రీన్యువల్ ఫీజు రూ. 5,000 ఉండగా, దానిని రూ.10,000కి పెంచారు. అదే విధంగా మోటార్ సైకిళ్ల రీన్యువల్ ఫీజు రూ. 1,000 నుండి రూ. 2,000కి పెరిగింది. త్రీ వీలర్లు, క్వాడ్రైసైకిళ్లు వంటి వాహనాల ఛార్జీలు కూడా...