అన్నదాతల అరిగోసకు కాంగ్రెస్సే కారణం: బిజెపి రాష్ట్ర నేత సురేష్ రెడ్డి

కాక‌తీయ‌, పెద్ద‌ప‌ల్లి : తెలంగాణ రాష్ట్రంలో యూరియా కోసం రైతులు పడుతున్న అరిగోసకు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలే కారణమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన నివాసంలో మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం కోరినట్లు కేంద్రం 6.12లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను పంపించిందన్నారు. ఇప్పటికే రాష్ట్రం వద్ద 1.76లక్షల యూరియా నిల్వలు ఉందని, అయినా యూరియా కొరత ఏర్పడటం సందేహాలకు తావిస్తోందన్నారు. కాంగ్రెస్ నేతలు వ్యాపారులతో కుమ్మక్కై యూరియాను బ్లాక్ మార్కెటుకు తరలించారని ఆరోపించారు. రాష్ట్రానికి...