గోసంతతిని కాపాడడం అందరి కర్తవ్యం..!!
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : విశ్వహిందూ పరిషత్ కరీంనగర్ విభాగ గోరక్ష సమావేశం ఆదివారం కరీంనగర్ లోని పరిషత్ కార్యాలయం నిర్వహించారు. ఈ సమావేశానికి విభాగంలోని నాలుగు జిల్లాల నుంచి 20 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. దక్షిణ భారత గోరక్ష ప్రముఖుడు యాదగిరిరావు, తెలంగాణ ప్రాంత గోరక్ష ప్రముఖుడు వెంకన్న, గోరక్ష టీం సభ్యుడు రాధాకృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి ఆదిమూలం విద్యాసాగర్ మార్గదర్శనం చేశారు. ఈ సందర్భంగా యాదగిరిరావు మాట్లాడుతూ గోమాతలో సమస్త విశ్వాన్ని, మానవాళి ఆరోగ్యాన్ని, ప్రకృతిని, భూమిని, పర్యావరణాన్ని కాపాడే శక్తి...