ఫీజు రియంబర్స్మెంట్‌పై రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది: హరీశ్ రావు ఫైర్
కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ సమస్యను పట్టించుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు, విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను విస్మరించి ప్రభుత్వం టెండర్ల కోసం మాత్రమే కృషి చేస్తోందని ఆయన ఆరోపించారు. గత రెండేళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సుల విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి వచ్చింది. దాదాపు 13...