ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి..!!

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : రాష్ట్రంలో కళాశాలలకు బకాయిపడ్డ ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్, 16న తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్ కు బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ (బీఎస్ఎఫ్) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జక్కనపల్లి గణేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న 8000 కోట్ల రూపాయలు, ఇప్పటికే టోకెన్ జనరేట్...