IND VS PAK: బ్యాట్లు, బంతులే ఆయుధాలు..నేడే భారత్-పాకిస్తాన్ మ్యాచ్..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: భారత్-పాక్ మ్యాచ్ అంటేనే ప్రపంచ క్రికెట్ అభిమానులకు ఉత్కంఠ కలిగించే పోరాటం. ఎప్పుడూ ఈ రెండు జట్లు తలపడితే మైదానంలో హై-వోల్టేజ్ డ్రామా చోటు చేసుకుంటుంది. అయితే, ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఆసియా కప్‌లో భాగంగా నేడు దుబాయ్‌లో ఇండియా-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నా, ఎక్కడా కనిపించాల్సిన ఉత్సాహం లేకపోవడం గమనార్హం. తాజాగా పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి కారణంగా దేశవ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. శత్రు దేశమైన పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడకూడదని చాలామంది భారతీయులు గట్టిగా కోరుతున్నారు. మన సైనికులపై...