Seethakka: మేడారం జాతరకు కొత్త రోడ్లు.. బైక్‌పై ఎస్పీతో కలిసి మంత్రి సీతక్క పరిశీలన
కాకతీయ, ములుగు: 2026 మేడారం మహా జాతర దృష్ట్యా రవాణా, రోడ్ల సౌకర్యాలు, పార్కింగ్ ప్రదేశాలపై కసరత్తు చేస్తున్నారు. మేడారం జాతర ఏర్పాట్లను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ప్రత్యక్షంగా పరిశీలించారు. ములుగు ఎస్పీ డాక్టర్ శబరీష్ తో బైక్‌పై మంత్రి సీతక్క పరిశీలించారు. మేడారం పరిసర ప్రాంతాల్లో ఉపయోగించే రహదారుల పరిస్థితి, నూతన రోడ్ల అభివృద్ధిపై పలు సూచనలు చేశారు. కొండపర్తి నుంచి గోనేపల్లి మీదుగా ఆర్టీసీ బస్‌స్టాండ్ వరకు కొత్త రోడ్డును అభివృద్ధి చేసేందుకు పరిశీలించారు. గోవిందరావుపేట...