రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి హాట్ కామెంట్స్..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలపై మరోసారి చర్చ మొదలైంది. సిద్ధిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ ఆయనను పిలిచి విచారణ జరిపింది. ఈ సమావేశం అనంతరం కమిటీ నర్సారెడ్డికి నోటీసులు జారీ చేస్తూ, వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నర్సారెడ్డి తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ స్పందించారు. నేను ఎవరినీ కించపరచలేదు. నేను నేడు ఉన్న స్థాయికి రావడానికి దళితుల సహకారం ప్రధాన కారణమన్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడూ దళితులకు ప్రాధాన్యత...