తాగునీటి సమస్య పట్టించుకోని అధికారులు.. రోడ్డెక్కిన మహిళలు..!!

కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి జిల్లా లక్ష్మిదేవిపల్లి మండలంలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. గత పది రోజులుగా ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. సహనం కోల్పోయిన రేగళ్లపాడుతండా (పెద్దతండ) మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. గత పది రోజులుగా అటు కిన్నెరసాన్ని నీళ్లు కానీ ఇటు మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఇదే విషయాన్ని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడ సమస్యను పరిష్కరించకపోవడంతో ఇలా మండుటెండలో నీటి కోసం నిరసన చేస్తున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తండా...