రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలి : ఐవైసి జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్
కాకతీయ, కొత్తగూడెం : రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని, ఓటు చోరీతో ఎన్నికల్లో గెలిచి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీ తీరును ఎండగట్టాలని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్, ఉపాధ్యక్షులు గడ్డం రాజశేఖర్ అన్నారు. విద్యానగర్ లోని రెవిన్యూ మంత్రి పొంగులేటి క్యాంప్ ఆఫీస్ లో కొత్తగూడెం అసెంబ్లీ అధ్యక్షులు పాల సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన యువజన కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న వారు మాట్లాడుతు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి రాబోయే...