భద్రాచలం ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం.. మహిళా రోగితో అసభ్యంగా ప్రవర్తించిన ల్యాబ్ టెక్నీషియన్..!!
కాకతీయ, భద్రాచలం : వైద్యం కోసం వచ్చిన మహిళతో ఎక్స్ రే తీసే వంకతో అసభ్యంగా ప్రవర్తించిన దారుణ ఘటన భద్రాచలంలో వెలుగులోకి వచ్చింది. ఒరిస్సా నుండి వైద్యం కోసం వచ్చిన ఓ మహిళా రోగి పట్ల ల్యాబ్ టెక్నిషియన్ అసభ్యంగా ప్రవర్తించాడు. భద్రాచలం బస్టాండ్ వెనుక గల ఓ ప్రముఖ ప్రయివేట్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎక్స్ రే తీయాలనే వంకతో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని సదరు మహిళా ఆసుపత్రి యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికి వాళ్ళు పట్టించుకోలేదని వాపోయింది. దీంతో...