విద్య, వైద్యం పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
కాకతీయ, మహబూబాబాద్ టౌన్: విద్య, వైద్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ బయ్యారం మండలంలోని నామాల పాడు లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ పాఠశాల విద్యార్థుల కిచెన్ హాల్, డైనింగ్ హాల్, మ్యూజిక్ గది, తరగతి గదులను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడి బోధనాంశాల పై వారి సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా...