చంద్రన్నపై తప్పుడు ప్రచారాన్ని ఖండించండి..!!
కాకతీయ, బయ్యారం: సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ కార్యదర్శి కామ్రేడ్ చంద్రన్న పై కొద్దిరోజుల నుండి అశోక్ ముఠా అదే పనిగా చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండిస్తూ సోమవారం సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ అధ్వర్యంలో మండల కేంద్రంలోని విబిటి ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఆరేల్లి కృష్ణ మాట్లాడారు. బయ్యారంలో రెండు విప్లవ సంస్థల విలీనం పేరిట అశోక్ ముఠా, సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రటిక్, రివల్యూషనరీకి చెందిన నాయకులు నిర్వహించిన...