క్రమశిక్షణే విద్యార్థి ఎదుగుదలకు పునాది..!!

కాకతీయ, నల్లబెల్లి: ప్రతీ విద్యార్థి క్రమ శిక్షణతో విద్యను అభ్యసిస్తే, ఆ విద్యే వారి ఎదుగుదలకు పునాదిగా నిలుస్తుందని ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయుడు లడే రవీందర్ అన్నారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా టీ-శాట్ ఛానల్ ద్వారా ప్రసారమైన విలువల విద్య అంశాన్ని పాఠశాల విద్యార్థులు చూడటానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో క్రమశిక్షణ అవసరత, యోగా సాధన వల్ల లాభాలు, విద్య ప్రాముఖ్యత, డ్రగ్స్ వంటివాటితో వచ్చే ప్రమాదాలు అనే అంశాలపై అవగాహన కల్పించారని ఆయన తెలిపారు. విలువ ఆధారిత...