దేవుళ్ల పేరుతో రాజకీయం చేయొద్దు: మంత్రి సీతక్క

కాకతీయ, ములుగు ప్రతినిధి: పూజారుల అంగీకారంతోనే మేడారం గద్దెల ప్రాంతంలో మార్పులు చేపట్టనున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గిరిజన గోత్రాలు, పూజా ఆచారాల ప్రకారం అమ్మవార్ల పూజారుల అంగీకారం పూర్తయిన అనంతరమే గద్దెల ప్రాంతంలో మార్పులు చేపడతామని స్పష్టం చేశారు. పూర్తిస్థాయిలో డీ.పి.ఆర్. సిద్ధమైన తర్వాత ముఖ్యమంత్రి సమీక్షలో నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. దేవుని పేరు చెప్పి రాజకీయాలు చేయకూడదని, భక్తుల...