గుడుంబా స్థావరాలపై ఆబ్కారీ దాడులు..!!
కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ మండలంలో సోమవారం అనంతారం, బోడగుట్టతండా, ఏటిగడ్డతండాలో మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్, వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ డిటిఎఫ్ మహబూబాబాద్, ఎస్టీ ఎఫ్ హైదరాబాద్ టీంలు సంయుక్తంగా సారాయి స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆబ్కారి శాఖ సిఐ చిరంజీవి మాట్లాడుతూ.. దాడుల్లో నలుగురిపై కేసులు నమోదు చేశామని, 22లీటర్ల సారాయి స్వాధీనం చేసుకుని 800 లీటర్లబెల్లం పానకం ధ్వంసం చేశామని తెలిపారు. అనంతరం సారాయి తయారీదారులను తహశీల్దార్ ముందు బైండోవర్ చేయటం జరిగిందని తెలిపారు. ఈ దాడులలో నాగేశ్వర్ రావు,...