అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..!!

కాకతీయ, దుగ్గొండి: వ్యవసాయ పెట్టుబడికి చేసిన అప్పులు తీర్చలేక బావిలో దూకి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని మర్రిపల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కశివోజుల బ్రహ్మం తన వ్యవసాయ భూమిలో గత ఐదు ఏండ్లుగా మిరప పంట వేసి పంట సరిగా దిగుబడి రాకపోవడంతో ఆర్థిక నష్టం వాటిల్లింది. దీంతో ఫైనాన్స్, ప్రయివేటు అప్పులు, హౌసింగ్ లోన్ ఐదు లక్షల వరకు అప్పులు చేశాడు. వాటిని తీర్చలేక ఇబ్బందులకు గురై మనస్థాపంతో...