ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలి..!!

కాకతీయ, ములుగు ప్రతినిధి: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మల్లంపల్లి మండల బీఆర్‌ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. సంఘం టౌన్ ప్రెసిడెంట్ చీదర సంతోష్, మండల యూత్ ప్రెసిడెంట్ మొర్రి రాజు యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ విధానాలు పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నాయని విమర్శించారు. విద్యార్థుల పరిస్థితి రోజురోజుకూ అగమ్యగోచరంగా మారుతోందని, విద్యా రంగంపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల...