ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలి..!!

కాకతీయ, హనుమకొండ : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న బోధన బకాయిలు, ఉపకార వేతనాలను తక్షణమే విడుదల చేయాలని కేయూ రీసెర్చ్ స్కాలర్స్, ఐక్య విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కేయూ గెస్ట్ హౌస్‌లో సమావేశమైన విద్యార్థి సంఘాలు, పరిశోధక విద్యార్థులు మాట్లాడారు. ఎనిమిది వేల కోట్ల రూపాయల ఫీజులు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలపై కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం విద్యారంగంపై సవతి తల్లి ప్రేమ చూపుతోందని విమర్శించారు....