రేవంత్ ఒక పాలన చాతకాని దద్దమ్మ: హరీశ్ రావు ఫైర్

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటూ, సోషల్ మీడియా వేదికగా ఎదురుదాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. హరీష్ రావు తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా చేసిన పోస్టులో, తెలంగాణలో ఆరోగ్యశ్రీ పూర్తిగా కుదేలైందని ఆరోపించారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులు ఈ పథకాన్ని నిలిపివేశాయని,...