కేంద్ర హస్తం లేకుండా ఇందిరమ్మ ఇండ్ల పథకం సాధ్యమే కాదు..!!

కాకతీయ, పినపాక: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతోందని మండల బీజేపీ అధ్యక్షుడు ధూళిపూడి శివప్రసాద్ బయ్యారం క్రాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు . ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కేంద్ర బీజేపీ హస్తం లేకుండా ఇళ్ల నిర్మాణం అసాధ్యమని, కేంద్రం ద్వారా ఇందిరమ్మ పథకం కింద రూ.1,70,000, అలాగే జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.80,000 లబ్ధిదారులకు అందుతోందని వివరించారు. అయినప్పటికీ, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు లక్షల సబ్సిడీ తమవల్లనే వస్తోందని...