మేడారం జాతర కోసం భారీ ఏర్పాట్లు: మంత్రి సీతక్క

దేవునిపై రాజకీయం చేయవద్దు. రైతుల హక్కులు కాపాడుతాం. మంత్రి సీతక్క హామీ..!! కాకతీయ, ములుగు: ములుగు జిల్లా పరిధిలో జరిగే మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతోంది. ములుగు ప్రాంతం బ్యూటిఫికేషన్‌, పార్కింగ్ సదుపాయాలు, అడవి సంరక్షణతో పాటు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం చుట్టూ పర్యాటక అభివృద్ధి పనులు కూడా వేగవంతం అవుతున్నాయని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ...