‘గద్దెల’ విస్తరణపై అర్థరహిత విమర్శలు చేయొద్దు .!!
కాకతీయ, ములుగు ప్రతినిధి: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర గద్దెల విస్తరణ అంశంపై రాజకీయ పార్టీలు, కుల సంఘాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని, జాతర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేయవద్దని మేడారం పూజారుల (వడ్డెల) సంఘం స్పష్టం చేసింది. సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, కార్యదర్శి చందా గోపాలరావు ఓ ప్రకటన జారీ చేశారు. 1944 నుంచి ఆదివాసీ ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం జాతర జరుగుతుందని, పూజారులు ఎదుర్కొనే సమస్యలు, భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నాలుగు విడతలుగా కలెక్టర్, మంత్రులతో చర్చించి మాస్టర్ ప్లాన్...