ప్రజా ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు సమర్పించిన వినతులను కలెక్టర్ స్వయంగా స్వీకరించి పరిష్కార నిమిత్తం ఆయా శాఖల అధికారులకు అందజేశారు. ప్రజావాణి కార్యక్రమానికి 166 ఫిర్యాదులు రాగా, అధికంగా రెవెన్యూ సమస్యలు 72, జీడబ్ల్యూ ఎంసీ 20, గృహ నిర్మాణ శాఖ 11, విద్యాశాఖ 9, డిఆర్డీఓ 7, ఇతర శాఖలకు సంబంధించిన 47 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర...