తహశీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం..!!
కాకతీయ, పినపాక: పినపాక తహశీల్దార్ కార్యాలయంలో మండలంలోని ప్రజా సమస్యలపై వినతులు తెలుసుకొని వాటి పరిష్కారానికై సోమవారం నాడు తహశీల్దార్ గొంది గోపాలకృష్ణ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని 71 గ్రామాలనుండి 6 అర్జీలు మాత్రమే రావడం విశేషం. వీటిలో ఇందిరమ్మ ఇళ్ళు, గృహజ్యోతి, పారిశుధ్య పనులు,పాఠశాల ప్రహరీ లకు సంబంధించిన వినతులు అందినట్లు తహశీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. అర్జీలను ఆన్లైన్ లో నమోదు చేసి సంబంధిత శాఖలకు పంపనున్నట్లు తెలిపారు. ప్రతీ సోమవారం ప్రజా వాణి కార్యక్రమం ఉదయం 10:30...