మంత్రి కొండా ఇంటి ముట్టడి..అంగన్వాడీల మహా ధర్నా..!!

కాకతీయ, వరంగల్ బ్యూరో : అంగన్వాడీ ఉద్యోగుల ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రీ ప్రైమరీ పీఎం శ్రీవిద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలన్న డిమాండ్‌తో సిఐటియు పిలుపు మేరకు వందలాది అంగన్వాడీలు మంత్రి కొండా సురేఖ ఇంటి ఎదుట మహాధర్నాకు దిగారు. ఈ క్రమంలో రాంనగర్ సుందరయ్య భవన్‌ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకుంటూ అరెస్టులు చేసి సుబేదారి, హనుమకొండ, కేయూ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. అయినప్పటికీ అంగన్వాడీలు పోలీసులు ఏర్పాటుచేసిన గేట్లను దాటి మంత్రి ఇంటి ముందుకు చేరుకున్నారు. దీంతో అక్కడ...