ప్రైవేట్ విద్యాసంస్థల బంద్ మద్దతు: సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు
కాకతీయ, కొత్తగూడెం : పెండింగ్ లో ఉన్న స్కాలర్‌షిప్స్ రీయంబర్స్ మెంట్ బకాయి లు విడుదల చేయాలని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తలపెట్టిన విద్యాసంస్థల బందుకు సిపిఎం మద్దతు తెలియజేసినట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. గత నాలుగు సంవత్సరాలుగా విద్యార్థులకు రావాల్సిన స్కాలర్‌షిప్స్ రీయింబర్స్మెంట్ బకాయులు పెట్టడంతో యాజమాన్యాలతో పాటు విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పిన మాటలు గుర్తు చేసుకోవాలని సూచించిన ఆయన రీయింబర్స్మెంట్ పథకం ప్రారంభించింది కాంగ్రెస్...