Waqf Amendment Bill: వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుపై సుప్రీం కీలక మధ్యంతర ఉత్తర్వు.. ఆ నిబంధన చెల్లదంటూ తీర్పు..!!
కాకతీయ, నేషనల్ డెస్క్: కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం, గత కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ముస్లింలకు అనుకూలంగా వచ్చినట్లు భావించిన వక్ఫ్ సవరణ చట్టంపై కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో కొత్త చట్టాన్ని తీసుకువచ్చి, పాత చట్టంలోని అనేక నిబంధనలను రద్దు చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ముస్లింల సమాజం నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు పిటిషనర్లు ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ వివాదాస్పద చట్టంపై దేశ అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర తీర్పు ఇచ్చింది. ఐదు...