పార్ట్ టైం అధ్యాపకుల మరణాలు బాధాకరం..!!

కాకతీయ, హనుమకొండ : చాలీచాలని జీతాలతో, ఉద్యోగ భద్రత లేకుండా విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల మరణాలు చూసైనా ప్రభుత్వం స్పందించాలని కేయూ పార్ట్ టైం అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ వై. రాంబాబు విజ్ఞప్తి చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనం ఎదుట జరిగిన సంతాప కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ విశ్వవిద్యాలయం హిస్టరీ విభాగానికి చెందిన పార్ట్ టైం అధ్యాపకుడు రమేష్, కేయూ జువాలజీ విభాగానికి చెందిన తిరుపతి హార్ట్ ఎటాక్‌తో మృతి చెందడం తీవ్ర విచారకరమన్నారు. రాష్ట్రం ఏర్పడిన...